పవన్‌ కళ్యాణ్ పేరుతో మరో అభ్యర్థి!

Another Candidate Named Pawan Kalyan,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,TDP,Janasena,Pawan Kalyan,Pawan Kalyan Vs PK In Pitapuram,Navarang,Congress Party,Telugu News,Pawan Kalyan Latest News,Pawan Kalyan News,Janasena News,Pitapuram,Navarang Congress Party,Pitapuram Election,Pitapuram Politics

మొన్నామధ్య ఓ న్యూస్‌ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం పేరిట ఆయన పోటి చేస్తున్న నియోజవర్గంలోనే మరో నలుగురు అదే పేరుతో బరిలోకి దిగారు. ఇలా ఒకే పేరుతో పోటి చేయడం ఓటర్లలో కన్ఫ్యూజన్‌కు దారి తీస్తుందని ఓ అభిప్రాయం ఉంది. ఇక పార్టీ గుర్తుల పోలి మరో గుర్తులు కూడా ఉంటాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌ పోటి చేస్తున్న పిఠాపురంలో ఓ ఆసక్తికర సీన్‌ కనిపిస్తోంది.

అక్కడ బకెట్.. ఇక్కడ గ్లాసు:

పవన్‌పై  నవరంగ కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి పవన్ కళ్యాణ్ పోటి చేస్తున్నారు. ఇటు మన పవర్‌స్టార్‌ పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అంటే ఇద్దరి పేర్లు కే.పవన్‌ కళ్యాణ్ అన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తును కేటాయించారుజ జనసేన పార్టీ అధినేత గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటం, వారి ఎన్నికల గుర్తులు కూడా ఒకేలా ఉండటం పవన్  కు పెద్ద తలనొప్పిగా మారింది. గ్రామీణ ఓటర్లు తన పేరును, తన పార్టీ గుర్తును అయోమయానికి గురిచేసి మరో అభ్యర్థికి ఓటు వేస్తారని జనసేన కార్యకర్తలు భయపడుతున్నారు. నవరంగ కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని లేదా వేరే ఎన్నికల గుర్తును కేటాయించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని జనసేన పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు.

హోరాహోరీ ఖాయమా?

మరోవైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, యువత చూపిస్తున్న ఉత్సాహాన్ని బట్టి చూస్తే పవన్‌కు రానున్న ఎన్నికల్లో కేక్ వాక్ విజయం గ్యారెంటీ అనే భావన వారిలో కనిపిస్తోంది. అయితే కాపు ఓటర్లలో చీలిక తెచ్చేందుకు సీనియర్ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సర్వశక్తులు ఒడ్డుతుండగా.. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి వంగా గీత డ్వాక్రా మహిళా లబ్ధిదారులతో పాటు బీసీ, ఎస్సీ ఓట్లను, ముఖ్యంగా మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారిని ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =