పెరుగుతున్న కరోనా కేసులు, ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Centre Covid-19 Management, Centre Decided to Depute High Level Teams to Kerala and Maharashtra, Centre High Level Teams to Kerala Covid-19 Management, Centre High Level Teams to Maharashtra Covid-19 Management, COVID-19 Management, High Level Teams to Kerala and Maharashtra for Covid-19 Management, Kerala Coronavirus, Kerala Coronavirus News, Maharashtra Covid-19 News, Maharashtra Covid-19 Updates, Maharashtra for Covid-19 Management, Mango News

దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిర్వహణ కోసం ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సహకరించడానికి కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు రెండు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కానీ దేశంలో ఉన్న మొత్తం యాక్టీవ్ కేసుల్లో కేవలం కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రమే 70% యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రకు వెళ్లే కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) మరియు న్యూఢిల్లీలోని డాక్టర్ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ నుండి నిపుణులు ఉన్నారు. అలాగే కేరళ వెళ్లే బృందంలో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అధికారి, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం తిరువనంతపురం మరియు న్యూఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ నిపుణులు ఉండనున్నారు. ఈ బృందాలు ఆయా రాష్ట్ర ఆరోగ్య విభాగాలతో కలిసి పనిచేస్తూ, స్థానిక పరిస్థితులను పరిశీలించి సమర్థంగా వ్యవహరించటానికి, అలాగే ఆ సందర్భంగా ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కోవటానికి మార్గదర్శనం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here