లక్ష్మీ పార్వతికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ కొట్టివేత

SC Dismisses Lakshmi Parvatis Petition To Investigate TDP Chief Chandrababu Assets, SC Dismisses Lakshmi Parvatis Petition, TDP Chief Chandrababu Assets Case, SC Dismisses Case Over Chandrababu Assets, SC Dismisses Lakshmi Parvatis Case, Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu, Lakshmi Parvati , Lakshmi Parvati Petition, Chandrababu Naidu Assets Case, Supreme Court, Supreme Court Dismised Case

లక్ష్మీ పార్వతికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ ఆమె, తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణిని అని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎన్టీఆర్ సతీమణి అనేది ఈ కేసులో ఏమైనా అదనపు అర్హత అవుతుందా? అని తిరిగి ప్రశ్నించింది.

ఈ క్రమంలో కోర్ట్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని, ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే పిటిషన్ కొట్టివేసిందని వ్యాఖ్యానించింది. దీనిపై ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని, లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశానికి విచారణార్హత లేదని పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు దినేశ్ మహేశ్వరి, బేలా త్రివేదీల ధర్మాసనం ప్రకటించింది. కాగా గతంలో కూడా ఇదే అంశంపై హైకోర్టు లోనూ లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seventeen =