జూలై 13న వైఎస్ఆర్ వాహన మిత్ర, కొత్తవారికీ దరఖాస్తు చేసుకునే అవకాశం

CM Jagan Will Release YSR Vahana Mitra Funds on July 13 Govt Gives Chance to New Applicants, AP Govt Gives Chance to New Applicants, CM Jagan Will Release YSR Vahana Mitra Funds on July 13, AP CM Jagan Will Release YSR Vahana Mitra Funds on July 13, AP CM YS Jagan Will Release YSR Vahana Mitra Funds on July 13, YS Jagan Will Release YSR Vahana Mitra Funds on July 13, YSR Vahana Mitra, New Applicants, YSR Vahana Mitra Funds, YSR Vahana Mitra Funds News, YSR Vahana Mitra Funds Latest News, YSR Vahana Mitra Funds Latest Updates, YSR Vahana Mitra Funds Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం “వైఎస్ఆర్ వాహన మిత్ర” పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 13న వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం 2022–23 నిధులు విడుదల చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాదికి అర్హుల నుంచి రాష్ట్ర రవాణా శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారితో పాటుగా కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ లు కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్‌ పి.రాజాబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. జూలై 7వ తేదీలోగా డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు తమ వాహనం పక్కనే ఉన్న ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. అలాగే కొత్తగా వాహనం కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకునే డ్రైవర్లు వారి యొక్క ఆధార్‌కార్డు, ఇంటి విద్యుత్‌ వినియోగం, తెల్ల రేషన్‌ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే గత 6 నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here