కరీంనగర్‌లో మానేరు నదిపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ఏప్రిల్‌ 14న ప్రారంభిస్తాం – మంత్రి గంగుల కమలాకర్‌

Minister Gangula Kamalakar Announces The Cable Bridge Over Maneru River in Karimnagar will be Inaugurated on April 14,Minister Gangula Kamalakar,Gangula Kamalakar Announces The Cable Bridge,Cable Bridge Over Maneru River in Karimnagar,Cable Bridge in Karimnagar will be Inaugurated on April 14,Mango News,Mango News Telugu,Minister Gangula Kamalakar Latest News,Minister Gangula Kamalakar Live News,Karimnagar Cable Bridge Latest News,Karimnagar Cable Bridge Latest Updates

కరీంనగర్‌లోని మానేరు నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ఏప్రిల్‌ 14న ప్రారంభిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌. ఈ మేరకు ఆయన శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణాన్ని గొప్ప నగరంగా అభివృద్ధి చేసేందుకు స్మార్ట్ సిటీ లక్ష్యంగా మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనులు చేపట్టామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా 224 కోట్లతో చేపట్టిన ఈ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, వచ్చే నెల 14 నాటికి అప్రోచ్‌ రోడ్లుతో పాటు 6.5 కోట్ల వ్యయంతో చేపట్టిన డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు పూర్తి చేసి వంతెనను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఇక అదేరోజు బ్రిడ్జిని ప్రారంభించి సందర్శకులను అనుమతిస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ కేబుల్‌ బ్రిడ్జి భవిష్యత్తులో నగరానికి ప్రముఖ పర్యాట కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, కొన్ని రోజుల పాటు ఈ బ్రిడ్జిపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సందర్శకులు బ్రిడ్జిపై ఆహ్లాదంగా గడిపేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కరీంనగర్‌ ప్రజలు ఈ అవకాశాన్ని వియోగించుకోవాలని కోరారు. అలాగే మానేరు రిఫర్‌ ఫ్రంట్‌ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని, అది కూడా మరో సందర్శన స్థలంగా మారుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here