ఆత్మకూరు ఉపఎన్నిక: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

AP Atmakur Assembly Constituency Bye-Election Polling Completed Peacefully, Atmakur Assembly Constituency Bye-Election Polling Completed Peacefully, AP Voting Begins For Atmakur Bypoll Continues Till 6 PM by Today Evening, AP Voting Begins For Atmakur Bypoll, Voting Begins For Atmakur Bypoll, Atmakur Bypoll Continues Till 6 PM by Today Evening, Atmakur Bye-Election Polling Today Election Officials Made All Arrangements, Atmakur Bye-Election Polling Today, Election Officials Made All Arrangements, Atmakur by-election, Atmakur Bye-Election Polling, Atmakur Bye-Election, Atmakur Polling Today, Polling for Atmakur by-election begins, Atmakur by-election, Nellore district SP Vijaya Rao said that strong security has been set up for the Atmakur by-election to be held Today, polling for the Nellore district Atmakur by-election has begun, Nellore district Atmakur by-election has begun,, Nellore district, Atmakur Bye-Election News, Atmakur Bye-Election Latest News, Atmakur Bye-Election Latest Updates, Atmakur Bye-Election Live Updates, Mango News, Mango News Telugu,

ఏపీలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సమయం ముగిసాక కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం గత 2019 సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం (82.44) తో పోలిస్తే తగ్గే అవకాశముంది. సాయంత్రం 5 గంటల వరకు 61.75 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు తెలుస్తుంది. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌ లో భద్రపరచనున్నారు. ఇక ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను మే 2వ తేదీన చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.

ఆత్మకూరు పోరులో 14 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన అధికార వైఎస్సార్సీపీ, బీజేపీల మధ్యే పోటీ నెలకుంది. ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణించడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ప్రస్తుతం ఉపఎన్నిక జరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్సీపీ నేతలు, తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరులో విజయం, మెజార్టీపై మరో రెండ్రోజులు వేచిచూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + one =