ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో ఆఖరు.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

AP Campaigning For The Atmakur Bypolls To End by Today Evening, Campaigning for Atmakur Bypolls, AP Campaigning For The Atmakur Bypolls, Atmakur Bypolls Campaigning, Atmakur Bypolls, Atmakur Bypolls Campaigning To End by Today Evening, AP Campaigning, Atmakur by election campaign, Atmakur byelection, AP Campaigning For Atmakur byelection, Atmakur byelection Campaigning, Atmakur elections Campaigning, Atmakur elections, Atmakur Bypolls Campaigning News, Atmakur Bypolls Campaigning Latest News, Atmakur Bypolls Campaigning Latest Updates, Atmakur Bypolls Campaigning Live Updates, Mango News, Mango News Telugu,

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారానికి గడువు నేటితో ముగియనుంది. గడచిన కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న పార్టీలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు తమ ప్రచారాన్ని ఆపనున్నాయి. కాగా ఈ యేడాది ఫిబ్రవరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో ఆత్మకూరు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. అధికార వైసీపీ గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులను నిలిపితే పోటీకి దూరంగా ఉండాలన్న తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక ఎన్నిక ఏకగ్రీవమే అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో అంతగా బలం లేని బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. తమ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో జూన్ 23న పోలింగ్ జరగనుండగా.. జూన్ 26న కౌంటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు ఈ ఎన్నిక కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోడల్‌ అధికారులతో, కలెక్టర్‌ చక్రధర్‌ బాబుతో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఉపఎన్నిక కోసం దాదాపు 1300 మంది సిబ్బందిని పోలింగ్‌ విధుల కోసం నియమించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 1000 మంది పోలీసులు మరియు కేంద్ర సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =