అస్సాగో బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

AP CM Jagan Participates in Ground Breaking Ceremony of Assago Industries Bio-ethanol Plant in East Godavari, Ground Breaking Ceremony of Assago Industries Bio-ethanol Plant in East Godavari, AP CM Jagan Participates in Ground Breaking Ceremony of Assago Industries, Assago Industries Bio-ethanol Plant in East Godavari, Assago Industries Bio-ethanol Plant, Ground Breaking Ceremony, AP CM YS Jagan Mohan Reddy, East Godavari Bio-ethanol Plant, Assago Industrial Private Limited, 270 Crore Bioethanol Plant, Gummaladoddi Industrial Park, Gummaladoddi Ethanol Project, AP CM YS Jagan East Godavari Tour, AP CM YS Jagan East Godavari Visit, Bio-ethanol Plant News, Bio-ethanol Plant Latest News And Updates, Bio-ethanol Plant Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అస్సాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ బయో ఇథనాల్‌ ప్లాంట్ ను అస్సాగో సంస్థ రూ.270 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, సీపీ గుర్నానీ తనయుడు, అస్సాగో ఇండస్ట్రీస్ ఎండీ ఆశిష్ గుర్నానీ, రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ణ, గుడివాడ అమర్ నాధ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా,ఎంపీలు భరత్ రామ్ , అనురాధ, వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, దేవుడి దయతో ఈ రోజు ఓ మంచి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతానికి మంచి బయో ఇథనాల్‌ ప్లాంట్ పరిశ్రమ రాబోతోందని, ఇందుకు ముందుకు వచ్చిన అసాగో ఇండస్ట్రీస్‌ ఎండీ, సీఈవో అశీష్‌ గుర్నానికి మరియు సహకారాలు అందిస్తున్న టెక్‌ మహేంద్ర ఎండీ సీపీ గుర్నానికి, కంపెనీ ప్రతినిధులకు, మంత్రి వర్గ సహచరులకు, అధికారులకు సీఎం అభినందలు తెలిపారు. 2 లక్షల లీటర్ల కెపాసిటీతో రూ.270 కోట్లతో ఈ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందని, 300-400 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని, ఆరు నెల‌ల్లో ఒక ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అన్ని ర‌కాల అనుమ‌తులు ఇప్పించ‌గ‌లిగామంటే రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత వేగంగా జ‌రుగుతుందో అర్థం చేసుకోవాల‌ని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here