ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

APSRTC, APSRTC News, APSRTC Offers 20% Discount, APSRTC Offers 20% Discount on Vijayawada-Bengaluru Route AC Buses, APSRTC Official Website, APSRTC Official Website for Online Bus Ticket Booking, Book Vijayawada to Bangalore APSRTC Bus Tickets, Book Vijayawada to Bangalore APSRTC Bus Tickets Price, Book Vijayawada to Bangalore APSRTC Bus Tickets Prices, Mango News, Vijayawada to Bangalore APSRTC Bus Tickets Price, Vijayawada to Bangalore APSRTC Bus Tickets Price Discount, Vijayawada to Bangalore APSRTC Bus Tickets Price News, Vijayawada to Bangalore Bus, Vijayawada to Bangalore bus APSRTC, Vijayawada-Bengaluru Route AC Buses

ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్యుపెన్సీ పెంచుకునే క్రమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు 20శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఓ ముఖ్యమైన రూట్లో ప్రయాణించేవారికి ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ-బెంగళూరు మధ్య ఆర్టీసీ చాలా సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలో బెంగళూరు రూట్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ రూట్లో ప్రైవేట్ బస్సులు కూడా చాలా నడుస్తుంటాయి. అందుకే, ఏపీఎస్ ఆర్టీసీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

విజయవాడ-బెంగళూరు మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్ ధరపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనంది. ఈ బస్సులు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. ఆయా బస్ స్టేషన్లలో ఎక్కేవారికి కూడా డిస్కౌంట్ వర్తించనుంది. ఐతే వారంలో ఓ రెండు రోజలు మాత్రం ఈ రాయితీలు వర్తించవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆదివారం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో, శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే బస్సుల్లో డిస్కౌంట్ వర్తించదు. మిగిలిన ఐదు రోజులు ప్రయాణికులు 20శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రతి రోజు సాయత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరే వెన్నెల స్లీపర్ సర్వీస్ లో టికెట్ చార్జి రూ.1,830 కాగా.. 20శాతం రాయితీతో రూ.1,490కే ప్రయాణించే అవకాశముంది. అలాగే సాయంత్రం 6గంటల కు బయలుదేరే అమరావతి ఏసీ బస్సులో బెంగళూరుకు రూ.1,710 టికెట్ చార్జీ కాగా.. డిస్కౌంట్ పోనూ రూ.1,365కే ప్రయాణించవచ్చు. బెంగళూరులో వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర పనుల మీద వెళ్లేవారికి ఈ డిస్కౌంట్ ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. వీకెండ్ లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో టికెట్ ధరలను సాధారణంగానే ఉంచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =