ఆ నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు వీరే..

TDP, Constituencies, TDP Candidates, YSRC, JSP, Pawan Kalyan, Andhra Pradesh, Andhra Pradesh MLA List, Telangana Elections, Parliamentary Constituencies, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
TDP, Chandrababu Naidu, TDP Candidates, AP Elections

ఏపీలో తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో దూకుడుగా ముందుకెళ్తోంది. జనసేనతో కలిసి వైసీపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుంటే క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తోన్న చంద్రబాబు.. వారిని ఢీ కొట్టేందుకు బలమైన నేతలను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీలు సీట్ల సర్దుబాటుపై ఏకాభ్రిపాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్‌లు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారట.

ఇప్పటికే చంద్రబాబు మూడు స్థానాలను ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాలను ప్రకటించారు. అలాగే చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు చంద్రబాబు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశారట. పొత్తులో భాగంగా ఆ జిల్లాలో రెండు స్థానాలను జనసేనకు కేటాయించగా.. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారట. ఈ మేరకు అభ్యర్థులకు సంబంధించి ఓ జాబితా నెట్టింట్లో వైరలవుతోంది. ఎప్పటిలానే తన సిట్టింగ్ స్థానమయిన కుప్పం నుంచే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు బరిలోకి దిగుతున్నారు.

ఇక పలమనేరు నుంచి అమరనాథ్ రెడ్డిని.. పీలేరు నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని.. నగరి నుంచి భాను ప్రకాశ్‌ని.. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డిని..చంద్రగిరి నుంచి పులివర్తి నానిని.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలయని గంగాధర నెల్లూరు నుంచి డాక్టర్ థామస్‌ను.. పూతలపట్టు నుంచి మురళీమోహన్‌ను.. శ్రీకాళహస్తి నుంచి సుధీర్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. ఇక చిత్తూరు అభ్యర్థి కోసం జడ్పీ మాజీ చైర్మన్ చంద్రప్రకాశ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్, మాజీ మేయర్ కఠారి హేమలత పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. వారిలో ఒకరిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నిహారిక పేరును తిరుపతి ఎంపీ స్థానానికి  చంద్రబాబు పరిశీలిస్తున్నారట. నిహారిక బాపట్ల ఎంపీ టికెట్ కోసం ఆశిస్తుంటే.. చంద్రబాబు మాత్రం తిరుపతి నుంచి పోట చేయించాలని భావిస్తున్నారట. ఇక చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా తలారి ఆదిత్య పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఆయా స్థానాలకు అధికారికంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 6 =