అనంతపురం జిల్లా విద్యుదాఘాతం ఘటనపై స్పందించిన సీఎం జగన్, విద్యుత్ శాఖకు కీలక ఆదేశాలు జారీ

AP CM YS Jagan Key Instructions To Electricity Department Over Anantapur District Incident,Anantapur District Electrocution Incident, CM Jagan Issued Orders To The Power Department, Andhra Pradesh Labourers Electrocuted,6 Labourers Electrocuted, AP Labourers Electrocuted,Mango News, Mango News Telugu, Andhra Pradesh News And Updates, Andhra Pradesh Crime News And Live Updates, Andhra Pradesh Crime, Andhra Pradesh Crime News, Andhra Pradesh, 6 Labourers Electrocuted To Death In Anantapur

అనంతపురం జిల్లాలో బుధవారం ట్రాక్టర్‌పై 11కేవీ హైటెన్షన్‌ వైర్‌ పడిపోవడంతో నలుగురు వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలాకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే విద్యుత్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలనీ, రెండు వారాల్లోగా ఈ ప్రక్రియ ముగించాలని సూచించారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించాలని, సత్వరమే వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు గ్రామం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన రైతు కమ్మూరి సుబ్బన్న తన పొలంలో పనికోసం అదే గ్రామానికి చెందిన 14మంది కూలీలను ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. వీరిలో 8మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అయితే పని పూర్తయ్యాక పొలం నుంచి తిరిగి ప్రయాణమైన క్రమంలో ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా పైనున్న 11కేవీ హైటెన్షన్‌ వైర్‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టర్‌పై పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కె ఫకీరప్ప తెలిపారు. ఇక ఈ ఘటనలో రైతు సుబ్బన్న సహా మరో ఐదుగురు కూలీలు అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =