రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

14 medical colleges in Andhra Pradesh, 14 New Medical Colleges In AP, Andhra to get 14 new medical colleges, AP CM YS Jagan Laid Foundation Stone for Construction of 14 Medical Colleges, AP CM YS Jagan Laid Foundation Stone for Construction of 14 Medical Colleges at a Time, AP to Get 14 New Medical Colleges Soon, Foundation Stone for Construction of 14 Medical Colleges, Jagan lay stone for 14 new medical colleges, Mango News, Medical Colleges, YS Jagan lays foundation stone for 14 medical colleges

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వర్చువల్‌ గా ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, విజయనగరం, అనకాపల్లి, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

ముందుగా రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నామని, 2023 చివరి నాటికి ఈ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 20 =