కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్‌

AP CM YS Jagan, Dussehra Navaratri Utsavalu, Silk Clothes to Goddess Kanaka Durga, Vijayawada, Vijayawada Kanaka Durga, Vijayawada Kanaka Durga Temple, Vijayawada Kanakadurga Temple, YS Jagan Offers Silk Clothes to Goddess Kanaka Durga, YS Jagan Offers Silk Clothes to Goddess Kanaka Durga at Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున కనకదుర్గ అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ముందుగా దుర్గగుడికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు వేదపండితులు, ఆలయ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ‌కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ఘటనకు కారణాలు తెలుసుకుని, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆలయం వద్దకు చేరుకుని పంచెకట్టు, తలపాగా ధారణతో అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ తో పాటుగా రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కొలుసు పార్థ సారధి, వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, జోగి రమేష్, అబ్బయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 9 =