వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra CM pays tributes to father, Andhra CM pays tributes to father YS Rajasekhara Reddy, Chief Minister of Andhra Pradesh, Mango News, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy Pays Tribute To Late YS Rajashekhara Reddy, YS Jagan Mohan Reddy Pays Tribute To Late YS Rajashekhara Reddy On His 12th Death Anniversary, YS Jagan pays tribute to YSR on 12th death anniversary, YS Rajashekhara Reddy, YS Rajashekhara Reddy 12th Death Anniversary, YS Rajashekhara Reddy Death Anniversary, YSR 12th death anniversary, YSR Death Anniversary

దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ షర్మిలతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరోవైపు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + nine =