నేడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్‌

AP CM YS Jagan Pays Tributes To Pingali Venkayya The Designer of Indian National Flag on His 146th Birth Anniversary, Pingali Venkayya The Designer of Indian National Flag, AP CM YS Jagan Pays Tributes To Pingali Venkayya on His 146th Birth Anniversary, AP CM Pays Tributes To Pingali Venkayya on His 146th Birth Anniversary, YS Jagan Pays Tributes To Pingali Venkayya on His 146th Birth Anniversary, AP CM YS Jagan Mohan Reddy Pays Tributes To Pingali Venkayya on His 146th Birth Anniversary, Tributes To Pingali Venkayya on His 146th Birth Anniversary, Pingali Venkayya 146th Birth Anniversary, Tribute To Pingali Venkayya, Tribute To Pingali Venkayya News, Tribute To Pingali Venkayya Latest News, Tribute To Pingali Venkayya Latest Updates, Tribute To Pingali Venkayya Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

నేడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర గురించి వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఇక పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. “దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మ‌న తెలుగు బిడ్డ పింగ‌ళి వెంక‌య్య‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. కుల‌, మ‌త, ప్రాంతాల‌క‌తీతంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్ర‌జలంద‌రికీ సెల్యూట్ చేస్తున్నా” అని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు పింగళి వెంకయ్య జన్మదినం సందర్భంగా ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా లోని ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్‌ శాఖ నేడు ఆవిష్కరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here