అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదు

AP Govt 100 Days Governance, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Botsa Satyanarayana Latest Press Meet, Botsa Satyanarayana Over AP Govt 100 Days Governance, Botsa Satyanarayana Press Meet, Botsa Satyanarayana Press Meet Over AP Govt, Botsa Satyanarayana Press Meet Over AP Govt’s 100 Days Governance, Mango News Telugu

వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ చూపిస్తున్నాడని, తుగ్లక్ పాలనంటే చంద్రబాబుదే అనే విషయం నారా లోకేష్ తెలుసుకోవాలని బొత్స సూచించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులను సీఎం జగన్ వందరోజుల్లో చేసి చూపించాడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం యొక్క 100 రోజుల పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. గత పాలనలో కంటే ఇప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఓడిపోయినా చంద్రబాబులో ఎటువంటి మార్పు రాలేదని, వరదలను కూడ రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

అమరావతి విషయంలో టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని అడిగారు. తనకున్న సమాచారం ప్రకారం అయితే అటువంటిది జరగలేదని, ఇతర నిర్మాణాల లాగే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని ఆరోపించారు. రాజధానికి ఒక అడ్రస్ అంటూ లేకుండా చేసారని, గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్ గతంలో రాజధానికి ఐదువేల ఎకరాలు సరిపోతాయని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేమో మాట మారుస్తున్నారని తనలా నాకు నటించడం రాదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

 

[subscribe]
[youtube_video videoid=TWmHzqg-Kqo]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =