విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Started House Plot Distribution In Vizianagaram District,Distributing Of YSR Jagananna Illa Pattalu,AP CM At Vizianagaram,CM Jagan Started YSR Jagananna Illa Pattalu Distribution Program,CM YS Jagan,Jagan Latest News,Jagan Live,Jagan Speech,Jagan Press Meet,Pulivendula,YCP,Pedalandariki Illu Scheme,Jagananna Illa Pattalu Distribution,YSR Housing Scheme,House Sites Distribution,Vizianagaram,Gunkalam Village,Amaravati,YSR Jagananna Illa Pattalu,AP Govt,YCP Latest News,AP News,AP Latest News,Mango News,CM Jagan At YSR Jagananna Illa Pattalu Distribution Program,Vizianagaram News,Mango News Telugu,AP CM YS Jagan Started House Plot Distribution

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్దదైన గుంకలాంలోని వైఎస్ఆర్‌ జగనన్న కాలనీ పైలాన్‌ ను సీఎం ఆవిష్కరించారు. అలాగే తొలివిడతలో అక్కడ నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను కూడా సీఎం ప్రారంభించారు.

ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తిని అందించే మహాయజ్ఞాన్నిప్రారంభించాం:

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, గుంకలాం లేఅవుట్ లో 400 ఎకరాల్లో 12301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో చెప్పిన దాదాపు 95 శాతం హామీలు పూర్తిచేశామని చెప్పారు. రాష్ట్రంలో సంక్రాతి పండుగ ముందే వచ్చిందన్న విధంగా ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్క పట్టణంలోనూ ఇళ్లులేని ప్రతి నిరుపేదకు లబ్ధి జరిగేలా 35.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని చెప్పారు. ఈ స్థలాలలో 28.30 లక్షల ఇళ్లు, ఇవిగాక 2.62 లక్షల టీడ్కొ ప్లాట్లు కలిపి మొత్తం 30 లక్షల 75 వేలు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here