మరో 2 రోజుల్లో టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్

local leaders, Jagan, Jana Sena, TDP, BJP, YCP,Mylavaram ticket,Vasantha Krishna Prasad, join, Devineni Uma, Chandrababu Naidu, Jagan, Pawan Kalyan,Mango News Telugu,Mango News,CM Jagan
local leaders, Jagan, Jana Sena, TDP, BJP, YCP,Mylavaram ticket,Vasantha Krishna Prasad, join, Devineni Uma, Chandrababu Naidu, Jagan, Pawan Kalyan

టీడీపీ, జనసేనతో కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీలో మంటలు రేపుతున్నాయి. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో తమకు సీట్లు లభించని నేతలంతా.. పార్టీపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతున్నారు. మరికొంతమంది అధికార వైఎస్సార్సీపీలోకి జంప్ అవుతూ.. తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి రెడీ అవుతున్నారు.

అయితే మరోవైపు కొద్ది వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి .. మైలవరం సెగ్మెంట్‌లో పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. ఇప్పటివరకూ అక్కడ వైసీపీ  ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీని వీడి  టీడీపీలో చేరడానికి రెడీ అయిపోయారు. దీనిపై మరో రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు  సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు ఈ రోజు ప్రకటించారు.

చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ది సాధ్యమని..అందుకే తాను టీడీపీలో చేరుతున్నానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏమీలేవన్న ఆయన..తమ ఇద్దరి మధ్య రాజకీయ పరంగానే పరిస్థితులు  మారినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ పార్టీల పరంగా చెరోదారి అని..ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉందని వసంత అన్నారు. తన టికెట్‌పై  టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

తాను పార్టీ లైన్ ప్రకారం అందరితో కలిసి పనిచేస్తానని..రెండు పార్టీల ముఖ్య నేతలను నేటి నుంచి కలిసి వారి సలహాలు, సూచనాలతో ముందుకెళతానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇప్పటి వరకు తనతో కలిసి నడిచిన వైసీపీ ముఖ్య నేతలతో పాటు టీడీపీ మెయిన్ లీడర్స్‌ను కూడా భావసారూప్యతతో తనతో కలిసి పని చేయడానికి ఆహ్వానిస్తున్నానని అన్నారు.ఈ రోజు నుంచి టీడీపీ ముఖ్య నేతలతో పాటు  భావసారూప్యత ఉన్న వైసీపీ నేతలను కూడా 5 మండలాల్లో కలుస్తానని..నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

రాజధాని అమరావతి నిర్మాణం కేవలం చంద్రబాబుతోనే  సాధ్యమవుతుందని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అయితే వసంత మీడియా ముందు మాట్లాడిన తర్వాత ఏపీ  రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇన్నాళ్లూ చంద్రబాబునే నమ్ముకుని ఉన్న దేవినేని ఉమకు మైలవరం టికెట్‌ను కేటాయిస్తారా.. లేక వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌ను అక్కడ నుంచి బరిలోకి  దింపుతారా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 3 =