ఈనెల 16వ తేదీన అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ‘ఏటీసీ టైర్స్‌’ కంపెనీ ప్రారంభించనున్న సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy was invited to inaugurate ATC Tires Plant, AP CM YS Jagan To Inaugurate ATC Tires Plant on Aug 16 at Atchutapuram SEZ Anakapalli, CM YS Jagan To Inaugurate ATC Tires Plant on Aug 16 at Atchutapuram SEZ Anakapalli, ATC Tires Plant at Atchutapuram SEZ Anakapalli, Atchutapuram SEZ Anakapalli, ATC Tires Plant Inauguration, Inauguration Of Alliance Tyre Company Tires Plant, Alliance Tyre Company Tires Plant, ATC Tires Plant News, ATC Tires Plant Latest News, ATC Tires Plant Latest Updates, ATC Tires Plant Live Updates, AP CM YS Jagan Mohan Reddy, Mango News, Mango News Telugu,

విశాఖపట్టణం సమీపంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ పార్క్‌ (సెజ్‌)లో ఇండియాస్ స్పెషల్ ప్రాజెక్ట్స్ జోన్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ నూతన టైర్ల యూనిట్‌ను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి ఈనెల 16న ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. కాగా గత జూన్ 24న ఏటీసీ టైర్స్ డైరెక్ట‌ర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్ర‌తినిధులు సీఎం జగన్‌ను కలిసి తమ నూతన ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. దీని ద్వారా ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కాగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా మొత్తం 165 మిలియన్ల డాలర్ల మూలధన పెట్టుబడితో కొత్త టైర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం రూ.2,350 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ పరిశ్రమ నెలకొల్పుతుండగా.. అందులో రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలిదశ యూనిట్‌ వాణిజ్య పరంగా ఉత్పత్తికి సిద్ధమైంది. ఇక ఈ కంపెనీ ఇప్పటికే మన దేశంలో రెండు టైర్ ప్లాంట్‌లను కలిగి ఉంది. ఒకటి గుజరాత్‌లోని దహేజ్ ప్లాంట్ కాగా ఇంకోటి తమిళనాడులోని తిరునెల్వేలి ప్లాంట్‌లో ఉంది. ఇక దీనితో పాటుగా మరో పదికి పైగా కంపెనీలు ఆగస్ట్ 16న అచ్యుతాపురం సెజ్‌లో భూమిపూజ చేసుకోనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + ten =