ఐపీఎల్-2023: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా నితీష్ రాణా

IPL 2023 Nitish Rana Named as New Captain of Kolkata Knight Riders,IPL 2023,Nitish Rana Named as New Captain,New Captain of Kolkata Knight Riders,Kolkata Knight Riders New Captain,Mango News,Mango News Telugu,Nitish Rana named KKR captain,Kolkata Knight Riders announce Nitish Rana,IPL 2023 Nitish Rana Appointed,New KKR Captain Nitish Rana,Nitish Rana to Lead Kolkata Knight Riders,IPL 2023 Latest News,IPL 2023 Latest Updates,Nitish Rana Latest News,Kolkata Knight Riders Latest Updates

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 సీజన్‌ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా నితీష్ రాణా నియమితుడయ్యాడు. ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సోమవారం ఒక ప్రకటన చేసింది. వెన్నెముక గాయం నుండి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్‌ అందుబాటులో లేకపోవడంతో నితీష్ రాణా కెప్టెన్‌గా వ్యవహరిస్తారని కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రకటించింది. ఐపీఎల్-2023 ఎడిషన్‌లో ఏదో ఒక దశలో శ్రేయాస్ కోలుకుని పాల్గొంటాడని ఆశిస్తున్నామని తెలిపారు.

“వైట్ బాల్ క్రికెట్‌లో తన రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్సీ అనుభవం మరియు 2018 నుండి కేకేఆర్ జట్టుతో నితీష్ కలిగి ఉన్న ఐపీఎల్ అనుభవం గొప్పగా పనిచేస్తుందని భావిస్తున్నాం. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ మరియు సహాయక సిబ్బంది ఆధ్వర్యంలో, నితీష్ మైదానం వెలుపల అవసరమైన అన్నిరకాల మద్దతును పొందుతాడని మరియు స్క్వాడ్‌లోని అత్యంత అనుభవజ్ఞులైన ప్లేయర్స్ మైదానంలో నితీష్‌కు అవసరమైన అన్ని విధాలా మద్దతును అందిస్తారని కూడా మేము విశ్వసిస్తున్నాము. మేము నితీష్ రాణా కొత్త పాత్రలో ఉత్తమంగా రాణించాలనిమరియు శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా మరియు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని కోల్‌కతా నైట్ రైడర్స్ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here