కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Visiting Flood Affected Areas of Konaseema District Today, Andhra CM YS Jagan Mohan Reddy Visits Flood-Affected Areas Reviews Situation, YS Jagan Mohan Reddy Visits Flood-Affected Areas And Reviews Situation, AP CM YS Jagan Mohan Reddy Visits Flood-Affected Areas Reviews Situation, AP CM YS Jagan Mohan Reddy Reviews Situation Of Flood-Affected Areas, Flood-affected areas in BR Ambedkar Konaseema district, BR Ambedkar Konaseema district, Konaseema district Flood-Affected Areas, Konaseema district, AP CM YS Jagan BR Ambedkar Konaseema district Tour, AP CM YS Jagan To Visit BR Ambedkar Konaseema district, Konaseema district Flood-Affected Areas News, Konaseema district Flood-Affected Areas Latest News, Konaseema district Flood-Affected Areas Latest Updates, Konaseema district Flood-Affected Areas Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (జూలై 26, మంగళవారం) డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా పి.గన్నవరం నియోజకవర్గంలోని గంటిపెదపూడి గ్రామానికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. గంటిపెదపూడిలో భారీ వర్షం కురుస్తుండగా, వర్షంలోనే సీఎం వరద బాధితులకు వద్దకు చేరుకున్నారు. పంటుపై లంక గ్రామాలకు చేరుకుని, అక్కడి నుంచి ట్రాక్టర్‌ లో పర్యటించారు. పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులను సీఎం పరామర్శించి, వారికీ శిబిరాల్లో ఎలాంటి సేవలు అందాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, అధికారులు, వాలంటీర్లు పనితీరుపై బాధితులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం అరిగెలవారిపేట చేరుకుని అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని ప్రజలకు సీఎం వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే ఉడిమూడిలంక గ్రామంలో కూడా వరద బాధితులతో సీఎం సమావేశం కానున్నారు.

ఇక మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని, అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళ్లి, అక్కడ వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి చేరుకుని, అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రికి సీఎం వైఎస్ జగన్ రాజమండ్రిలోనే బస చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =