నేషనల్ హెరాల్డ్ కేసు: మరోసారి ఈడీ విచారణకు హాజరయిన సోనియా గాంధీ, నిరసనగా రోడ్డుపై బైఠాయించిన రాహుల్ గాంధీ

National Herald Case Congress Interim President Sonia Gandhi Attends ED Enquiry For 2nd Time Today, Congress Interim President Sonia Gandhi Attends ED Enquiry For 2nd Time Today, Sonia Gandhi Appears Before ED For Second Time In National Herald News Money Laundering Case, National Herald News Money Laundering Case, Sonia Gandhi Appears Before ED For Second Time, 2012 National Herald money laundering case, Enforcement Directorate issued a fresh summons to the former President of the Indian National Congress, Sonia Gandhi former President of Indian National Congress, Indian National Congress, Enforcement Directorate, Sonia Gandhi, Enforcement Directorate issued a fresh summons to Sonia Gandhi, ED registered a case against the Gandhis, National Herald News Money Laundering Case News, National Herald News Money Laundering Case Latest News, National Herald News Money Laundering Case Latest Updates, National Herald News Money Laundering Case Live Updates, Mango News, Mango News Telugu,

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సోనియాను ప్రశ్నించనుండటం ఇది రెండోసారి. జూలై 21వ తేదీన తొలిసారి ఈడీ సోనియా విచారించిన సంగతి తెలిసిందే. కాగా ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అయితే దీనిని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు ర్యాలీ చేప‌ట్టారు. కాంగ్రెస్ పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహల దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రతినిధులను కోరారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోని అక్బర్ రోడ్‌లో 3 వరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. దీనికి ముందు సోనియాకు మద్దతు తెలిపేందుకు పార్టీ సీనియర్లు, ఎంపీలు సహా కీలక నేతలు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ పార్లమెంటులో కూడా దీనిపై నిరసన తెలపాలని నిర్ణయించారు. మరోవైపు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టీ-కాంగ్రెస్ హైదరాబాద్ లోని గాంధీ భవన్​లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది.

ఈ నేపథ్యంలో కేంద్రం తీరుని నిరసిస్తూ ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవటంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుపడటంతో సుమారు 30 నిమిషాల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు రాహుల్‌ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, రంజీత్‌ రంజన్‌, కేసీ వేణుగోపాల్‌, మానికం ఠాగూర్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి, కే సురేశ్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here