టీడీపీ అధినేత చంద్రబాబు, అమరావతి రైతుల మహాపాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

AP Ex Minister Perni Nani Sensational Comments on TDP Chief Chandrababu and Amaravati Farmers Maha Padayatra, Perni Nani Fire On Tdp Amaravati Farmers Padayatra, AP Ex Minister Perni Nani Comments on TDP Chief Chandrababu , Ex Minister Perni Nani Comments on Maha Padayatra, AP Ex Minister Perni Nani , Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu , YSR Congress Party, TDP Party, Amaravati Farmers Maha Padayatra, Perni Nani Latest News And Updates, TDP News And Live Updates

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టనున్న రెండో విడత మహాపాదయాత్రపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండగా ఏపీ రైతుల కోసం ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరుతో అక్కడ పెట్టుబడి పెట్టిన చంద్రబాబు బినామీలు, రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలే రైతుల ముసుగులో పాదయాత్రలు చేస్తున్నారని, ఉద్యమం పేరుతో యాత్రకు చందాలు అంటూ వసూళ్ల రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మహాపాదయాత్రను అడ్డు పెట్టుకుని చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. నాడు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఇవేమీ తెలియని నిజమైన రైతులు అన్యాయం అయ్యారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని, అధికారం నుంచి దిగిపోయే ముందు కూడా వేలకోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. అయితే ప్రసుత్తం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట మేరకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలలో 75% హామీలను కేవలం మూడేళ్ళలోనే అమలు చేశామని, రాష్ట్రంలో అన్ని వర్గాల వారికీ న్యాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వమేనని పేర్ని నాని అన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి ఉద్యమం ప్రారంభమై 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజధాని పరిరక్షణ సమితితో పాటు పలు రైతు ఉద్యమ సంఘాలు ఈనెల 12 నుంచి మహాపాద యాత్రను నిర్వహించటానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి నుంచి శ్రీకాకుళం లోని అరసవల్లి ఆదిత్యుని ఆలయం వరకు ఈ యాత్రను చేపట్టనున్నారు. అయితే ఈ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకులు నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో హై కోర్ట్ తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eleven =