హైదరాబాద్‌: పటాన్‌చెరులో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, వైద్యులకు కీలక సూచనలు

Telangana Finance Minister Harish Rao Inaugurates ESI Hospital in Patancheru Hyderabad Today, Telangana Minister Harish Rao Inaugurates ESI Hospital in Patancheru Hyderabad Today, Minister Harish Rao Inaugurates ESI Hospital in Patancheru Hyderabad Today, Harish Rao Inaugurates ESI Hospital in Patancheru Hyderabad Today, Minister Harish Rao Inaugurated ESI Hospital in Patancheru, Harish Rao Starts ESI Hospital in Patancheru, ESI Hospital in Patancheru, Patancheru ESI Hospital, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Telangana Finance Minister, Harish Rao, ESI Hospital, Patancheru ESI Hospital News, Patancheru ESI Hospital Latest News, Patancheru ESI Hospital Latest Updates, Patancheru ESI Hospital Live Updates, Mango News, Mango News Telugu,

పఠాన్‌చెరు ప్రాంతంలోని కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌ నగరం పటాన్‌చెరు పరిధిలోని రామచంద్రాపురంలో రూ.20 కోట్ల నిధులతో ఆధునీకరించిన ఈఎస్‌ఐ ఆస్పత్రిని మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈఎస్‌ఐ ఆస్పత్రి అంతటా కలియ తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో డాక్టర్లు ఎక్కువమంది ఉన్నప్పటికీ పేషెంట్లు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఇక రిజిస్టర్ పరిశీలించిన మంత్రి ఆస్పత్రిలోని నలుగురు వైద్యులు గత నాలుగేళ్లుగా విధులకు రావడం లేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. వైద్య పరికరాలు అందుబాటులో లేవనే కారణం చూపి డాక్టర్లు సరిగా పనిచేయడం లేదని తెలియడంతో పాటు ఆస్పత్రికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆస్పత్రిలో జూలై నెలకు గాను కేవలం మూడు ప్రసవాలు మాత్రమే జరిగాయని తెలుసుకున్న మంత్రి ఎందుకు ఇక్కడ ఎక్కువ ప్రసవాలు చేయడం లేదని నిలదీశారు. పేదలకు వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాకుడదని, చేపట్టిన వృత్తికి తగిన న్యాయం చేయాలని వైద్యులకు మంత్రి హరీష్ రావు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eight =