కార్గిల్ విజయ్ దివాస్ రోజున మొక్కలు నాటిన ఏపీ గవర్నర్

AP Governor Biswa Bhusan Harichandan Plants Saplings In Raj Bhavan, AP Governor gives call to plant trees to mark Kargil Vijay Diwas, AP Guv calls upon people to plant saplings on anniversary, Biswabhusan Harichandan sworn-in as first full time Governor, Mango News, Plants Saplings In Raj Bhavan by Biswabhusan

భారత్,పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో రెండు దశాబ్ధాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో, కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 తేదీ నుండి, జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ సమరంలో విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26 న కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 26 న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, కార్గిల్ విజయ్ దివాస్ జ్ఞాపకార్థంగా 5 మొక్కలను నాటాలని ఏపి పౌరులను కోరారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులు మరియు ఆర్మీ అధికారులకు హరిచందన్ నివాళులర్పించారు. విజయవాడలోని రాజ్ భవన్ ప్రాంగణంలో బిశ్వ భూషణ్ హరిచందన్ మొక్కలు నాటారు.

కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిశ్వ భూషణ్ హరిచందన్, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసం నివాళిగా ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పౌరుడిని కోరినట్లు గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశం యొక్క సమగ్రతను కాపాడవలసిన అవసరం ఉందని మరియు పరిశుభ్రమైన వాతావరణం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని గవర్నర్ కోరారు.

 

[subscribe]
[youtube_video videoid=p0FCLA_1HdI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =