ఎపిసోడ్ 5 (జూలై25) హైలైట్స్: వరుణ్ సందేశ్ Vs మహేష్ విట్టా

Bigg Boss 3 Telugu EPISODE 5 Highlights, Bigg Boss Episode 5 Latest News, Bigg Boss Season 3 Telugu Episode 5 Highlights, Bigg Boss Telugu 3 Comedian Mahesh Vitta Angered In the House, Early Clashes Set The Tone For Season 3 Big Boss, Highlights vs Mahesh Vitta Bigg Boss Episode 5, Mango News, War Of Words Between Vithika Vs Mahesh Vitta

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 25న ప్రసారమైన బిగ్ బాస్ 3 ఐదవ ఎపిసోడ్ లో కూడ సభ్యుల వాదనలు కొనసాగాయి, ఎపిసోడ్ చివరికి చేరుకునే సరికి వితికా విషయంలో వరుణ్ సందేశ్, మహేష్ విట్టా మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఎపిసోడ్ 5 (జూలై25) హైలైట్స్: వరుణ్ సందేశ్-మహేష్ విట్టా మధ్య గొడవ 

  • హేమ, రాహుల్ మధ్య గొడవ తగ్గించడానికి సభ్యులు వారి వంతు ప్రయత్నాలు చేయగా, ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గలేదు
  • ఈ వారం నాగార్జున గారు వచ్చినపుడు మాట్లాడదాం అని హేమ అనగా, నాగార్జున లెవెల్ ఏంటి, ఇక్కడ మన పత్తి వ్యాపారం ఏంటని మహేష్ సరదాగా అనడంతో హేమ అవాక్కయింది
  • తరువాత చపాతి సగం తినడం పై ఇంటిలో చర్చ మొదలయింది
  • తన చపాతీని అలీరేజా సగం తిన్నారని పునర్నవి భూపాళం గొడవ మొదలెట్టింది
  • హేమ వెళ్లి చపాతీ తిన్నావని అందరూ అనుకుంటున్నారని అలీరేజాను అడగడంతో, తిన్నది బాబా భాస్కర్ అంటూ అలీరేజా అసలు నిజం చెప్పేసాడు
  • కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నానని, బాబా భాస్కర్ అనడంతో చపాతీ వివాదం ముగిసింది
  • ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో హేమ,జాఫర్ పాల్గొని, లగ్జరీ బడ్జెట్ సాధించారు, అయితే బడ్జెట్ ఉపయోగించి వారానికి సరిపడా సరుకులు కొనడంలో మాత్రం సభ్యులు విఫలం అయ్యారు, ఈ విషయంలో హేమ శ్రీముఖిని తప్పు పట్టగా, శ్రీముఖి హేమ పై గొడవకు దిగింది
    తాను టైముకే వచ్చానని, టీవీ ఆన్ చేయకపోవడం వలన లేట్ అయిందని, రిమోట్ మహేష్ దగ్గర ఉందని తన తప్పు లేదని శ్రీముఖి వాదించింది
  • వితికా, తనను మహేష్ చేతి కింద నుండి లోపలికి పో అన్నాడని ఆరోపించడంతో, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా మధ్యగొడవ మొదలయింది. తన పెళ్ళానికి రెస్పెక్ట్ ఇవ్వమంటూ ఆగ్రహంతో వరుణ్ సందేశ్, మహేష్ మీదకు వెళ్ళాడు. వితికా కూడా జత కలవడంతో సభ్యులు వారిస్తున్నా, మహేష్- వరుణ్ సందేశ్ పెద్దగా అరుచుకుంటు, ఒకరికొకరు తగ్గకుండా వాదించుకున్నారు. తరువాతి ఎపిసోడ్ లో కూడా ఇద్దరి మధ్య గొడవ కొనసాగేలానే ఉంది. ఇంటిలో పరిస్థితులు వాడుకుని సభ్యులు ఒకరిమీద మరొకరు పై చేయి సాధించడానికి చూస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here