ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ భేటీ

AP Governor Biswabhusan Harichandan Meets PM Modi at Delhi Today, Andhra Pradesh Governor Biswabhusan Harichandan will leave for New Delhi To Meets PM Modi, andhra pradesh governor biswabhusan harichandan meets PM Narendra Modi at Delhi Today, Andhra Pradesh Governor Biswabhusan Harichandan Meets PM Modi at Delhi Today, AP Governor Biswabhusan Harichandan Meets PM Modi, Biswabhusan Harichandan Meets PM Modi at Delhi , Governor Biswabhusan Harichandan Meets PM Modi, AP Governor Biswabhusan Harichandan, AP Governor, Biswabhusan Harichandan, Governor Biswabhusan Harichandan, Prime Minister Modi, PM Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిశ్వభూషణ్ హరిచందన్‌ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని గవర్నర్‌ మర్యాదపూర్వకంగానే కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు సహా అనేక అంశాలను కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఇక శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా ఏపీ గవర్నర్ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. కాగా గురువారం నాడు విజయవాడ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లిన గవర్నర్‌, అక్కడినుంచే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇటీవల పలు రాష్ట్రాల గవర్నర్లు ప్రధాని మోదీతో వరుసగా భేటీ అవుతుండడంతో తాజాగా ఏపీ గవర్నర్ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here