మాండుస్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Demands AP Govt to help Farmers Affected by Cyclone Mandous with Financial Assistance,Mandus Cyclone Affected Farmers, Affected Farmers Financial Assistance,Pawan Kalyan On Mandus Cyclone Affected Farmers,Mango News,Mango News Telugu,Heavy Rains In Ap,Mandus Cyclone,Mandus Cyclone Ap,Andhra Pradesh Heavy Rains,Heavy Rains In Ap,Ap Heavy Rains,Rain Prediction In Ap,Heavy Rains In Andhra,Imd Prediction Os Rains,Imd Ap,Ap Imd,India Metoroligical Department,Imd Latest News And Updates,Imd News And Live Updates,Imd Rains For Next 2 Months In Ap, Andhra Pradesh Imd,India Metoroligical Department News And Updates

మాండుస్ తుఫాన్ బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. “ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రైతులను మాండుస్ తుపాను మరోసారి దెబ్బ తీసింది. కోతకు వచ్చిన చేలు, కల్లంలో ఉంచిన ధాన్యం కళ్లెదుట నీటిలో నానిపోతుంటే దైన్యంగా చూస్తున్న రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి పంట నీటిపాలైంది. పత్తి లాంటి వాణిజ్య పంట, బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు తుపాను ధాటికి నేల రాలాయి. ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పరు?, ప్రత్యర్థి రాజకీయపక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు చెప్పరు?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ధాన్యం అమ్ముకోవడానికి అగచాట్లు:

“గత వ్యవసాయ సీజన్ కి సంబంధించి ధాన్యం బకాయిలు రూ.320 కోట్లుపైగా ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందీ, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. ఈ సీజన్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. తేమ శాతం పేరుతో ఇబ్బందులు పాల్టేస్తున్నారు. లక్షన్నర ఎకరాలలో వరి పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఇంకొన్ని లక్షల ఎకరాలలో చేలు నీటిలో నానుతున్నాయి. అందువల్ల తుపాను దెబ్బతో నష్టపోయిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అండను ఇవ్వాలి. సహేతుకమైన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు చెల్లించాలి. కల్లంలోని తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా తక్షణం కొనుగోలు చేయాలి. కూరగాయలు, పండ్లతోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు చేతనైనంతగా సహాయపడండి. నష్టంతో అసహాయంగా ఎదురుచూస్తున్న రైతుల పక్షాన నిలబడండి. వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. రైతాంగానికి మానసిక ధైర్యం కల్పించండి. సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో ప్రశ్నించండి” అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =