కాంగ్రెస్ గెలుపుపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Sensational Comments of CPI Narayana on Congress Victory,Sensational Comments of CPI,CPI Narayana on Congress Victory,Sensational Comments on Congress Victory,CPI, CPI Narayana, Congress, Telangana assembly elections,Mango News,Mango News Telugu,CPI Narayana Strong Comments,Latest CPI Narayana Comments,CPI Narayana Latest News,CPI Narayana Latest Updates,CPI Narayana Live News,Narayana on Congress Victory Latest News
CPI, CPI Narayana, Congress, Telangana assembly elections

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఒకప్పుడు రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీ.. ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటకలో గెలుపుతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అదే ఊపుతో ముందుకెళ్లిన కాంగ్రెస్.. తెలంగాణలో గెలుపొంది తీరింది. ఈసారి సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లి విజయకేతనం ఎగురవేసింది. సీపీఐతో కలిసి మొత్తం 65 స్థానాలను కైవసం చేసుకుంది. కొత్తగూడెం నుంచి సీపీఐ తరుపున పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు.

అయితే తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా గెలుపొందాలని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయింది. ఒక్క తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఓటమి పాలయింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు సీపీఐ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగానలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటున్నారు.

సోమవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందిందని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతల మెజార్టీకి సీపీఐ ఓట్లు ఉపయోగ పడ్డాయని చెప్పారు.  మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణలో మాదిరిగానే అక్కడ కూడా గెలుపొందేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అటు త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా మార్పు తథ్యమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బతికుండగానే తన సమాధి తానే కట్టుకున్నారని.. ప్రతి గ్రామంలో సమాధిరాయి వేసుకున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన తప్పుల కంటే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎక్కువని నారాయణ ఆరోపించారు.

అలాగే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై కూడా నారాయణ స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక తమిళనాడులో 2 స్థానాలు.. పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాలు.. కేరళలో 4 స్థానాలతో పాటు చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ నుంచి పోటీ చేయనున్నట్లు నారాయణ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =