ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులు ఖరారు, ఫీజుల వివరాలు ఇవే…

Andhra Pradesh Government, Andhra Pradesh government fixes fee for private schools, AP Govt, AP Govt Announced Complete Fee Structure for Private Schools, AP Govt Announced Complete Fee Structure for Private Schools and Colleges, AP Govt Announced Complete Fee Structure for Private Schools and Colleges in the State, Complete Fee Structure for Private Schools and Colleges, Complete Fee Structure for Private Schools and Colleges In AP, Mango News

రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మరియు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మరియు మానిటరింగ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేశారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్‌ రెండేళ్ల కోర్సులకు సంబంధించిన ఈ ఫీజులు 2021-22 నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తాయని చెప్పారు.

అలాగే ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు, ఎగ్జామినేషన్‌ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, స్టూడెంట్‌ వెల్ఫేర్ ఫండ్, స్టూడెంట్‌ హెల్త్‌ కేర్ స్కీం, స్టడీ టూర్‌, అల్యూమీని, అకాడమిక్స్ కు సంబంధించిన ఇతర ఫీజులన్నీ ఇందులోనే కలిపి ఉంటాయని తెలిపారు. ఈ ఫీజులను విద్యార్థుల నుండి ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని చెప్పారు. అలాగే విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు ఉంటే, రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఫీజులను పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా నిర్ణయించారు.

తరగతుల వారీగా స్కూల్ ఫీజుల వివరాలు: ప్రైమరీ (నర్సరీ నుంచి 5వ తరగతి వరకు – సంవత్సరానికి)

  • పంచాయితీల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.10000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.18000
  • మున్సిపాలిటీల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.11000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.20000
  • కార్పొరేషన్ల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.12000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.24000

తరగతుల వారీగా స్కూల్ ఫీజుల వివరాలు: సెకండరీ (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు – సంవత్సరానికి):

  • పంచాయితీల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.12000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.18000
  • మున్సిపాలిటీల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.15000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.20000
  • కార్పొరేషన్ల పరిధిలో స్కూల్ ఫీజు : రూ.18000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.24000

గ్రూపుల వారీగా జూనియర్ కళాశాలల్లో ఫీజుల వివరాలు :

  • పంచాయితీ పరిధిలో : ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ.15000, సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు రూ.12000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.18000
  • మున్సిపాలిటీల పరిధిలో : ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ.17500, సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు రూ.15000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.20000
  • కార్పొరేషన్ల పరిధిలో : ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ.20000, సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు రూ.18000, వసతి సౌకర్యం ఫీజు (హాస్టల్ లో ఉంటే) – రూ.24000.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =