ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల, మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

APPSC Group-1 Preliminary Results Released Check The Mains Exams Schedule,APPSC Group-1 Preliminary,APPSC Results Released,Check The Mains Exams Schedule,Mango News,Mango News Telugu,Appsc Group 1 Total Marks,Appsc Group 1 Toppers Marks,Appsc Group 1 Syllabus,Appsc Group 1 Schedule,Appsc Group 1 Salary,Appsc Group 1 Prelims Result,Appsc Group 1 Prelims Qualifying Marks,Appsc Group 1 Prelims Exam Pattern,Appsc Group 1 Posts,Appsc Group 1 Number Of Posts,Appsc Group 1 Jobs List,Appsc Group 1 Jobs

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 2022-23 ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. ఇక గ్రూప్-1 ఫలితం ఇప్పుడు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో అందుబాటులో ఉంచబడింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని ఏపీపీఎస్సీ సూచించింది. కాగా గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. జనవరి 8న 18 జిల్లా కేంద్రాలలో రెండు షిఫ్టులలో నిర్వహించబడింది. ఇక ఆన్‌లైన్ పరీక్షకు 87,718 మంది అభ్యర్థులు హాజరవగా.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 6,455 మందిని మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరుగనున్న మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • ఏప్రిల్ 23 – పేపర్ ఇన్ తెలుగు
  • ఏప్రిల్ 24 – పేపర్ ఇన్ ఇంగ్లీష్
  • ఏప్రిల్ 25 – పేపర్-1 (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఎస్సే)
  • ఏప్రిల్ 26 – పేపర్-2 (హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్)
  • ఏప్రిల్ 27 – పేపర్-3 (పాలిటిక్స్, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా మరియు ఎథిక్స్)
  • ఏప్రిల్ 28 – పేపర్-4 (ఎకానమీ, డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్)
  • ఏప్రిల్ 29 – పేపర్-5 (సైన్స్, టెక్నాలజీ మరియు ఎన్విరాన్‌మెంటల్ సంబంధిత అంశాలు)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here