హైదరాబాద్ లో ఎల్బీన‌గ‌ర్, స‌న‌త్‌న‌గ‌ర్‌, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

Telangana CM KCR Lays Foundation Stone for Alwal TIMS Hospitals, Telangana CM KCR Lays Foundation Stone for LB Nagar TIMS Hospitals, Telangana CM KCR Lays Foundation Stone for Sanath Nagar TIMS Hospitals, CM KCR Lays Foundation Stone for TIMS Hospitals, CM KCR laid the foundation stone for three TIMS hospitals, Telangana Institute Medical Sciences, Telangana CM KCR Lays Foundation Stone for Telangana Institute Medical Sciences Hospitals, Foundation Stone for Telangana Institute Medical Sciences Hospitals, TIMS hospitals, TIMS hospitals News, TIMS hospitals Latest News, TIMS hospitals Latest Updates, TIMS hospitals Live Updates, hospitals, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ మహానగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (టిమ్స్) తో పాటుగా, కొత్తగా ఎల్బీన‌గ‌ర్ (గడ్డి అన్నారం), అల్వాల్ (బొల్లారం), స‌న‌త్‌న‌గ‌ర్‌ (ఎర్రగడ్డ)ల‌లో మరో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీన‌గ‌ర్, అల్వాల్, స‌న‌త్‌న‌గ‌ర్‌ ల‌లో నిర్మించే టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగడ్డలో 17 ఎకరాల్లో, గడ్డిఅన్నారంలో 21.3 ఎకరాల్లో నిర్మించే ఆసుపత్రులను జీ+14 విధానంలో, అల్వాల్‌ లో 28.41 ఎకరాల్లో నిర్మించే ఆసుపత్రిని జీ+5 విధానంలో నిర్మిస్తున్నారు. ఇటీవలే టిమ్స్ ఎల్బీన‌గ‌ర్ కు రూ.900 కోట్లు, టిమ్స్ అల్వాల్ కు రూ.897 కోట్లు, టిమ్స్ స‌న‌త్‌న‌గ‌ర్‌ కు రూ.882 కోట్లు కలిపి మొత్తం రూ.2,679 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అనుమతులను మంజూరు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + six =