రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్‌ కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Issue, AP Govt Constitutes High Power Committee, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, GN Rao Committee Report, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్‌ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా డిసెంబర్ 29, ఆదివారం నాడు హైపవర్‌ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ హైపవర్‌ కమిటీ జీఎన్‌ రావు కమిటీ నివేదికతో పాటుగా, బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూపు (బీసీజీ) ఇవ్వబోయే నివేదికను సైతం అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులుతో సహా సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులుతో మొత్తం 16 మందిని హైపవర్‌ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని, అవసరమైతే ఈ విషయంలో అడ్వొకేట్‌ జనరల్‌ సూచనలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైపవర్‌ కమిటీ సభ్యులు:

 • ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 • హోంమంత్రి మేకతోటి సుచరిత
 • మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
 • ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
 • పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
 • విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌
 • పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని
 • వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 • రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
 • మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ
 • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
 • ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం
 • ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
 • సీసీఎల్‌ఏ
 • పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
 • న్యాయ శాఖ కార్యదర్శి

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =