నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్, ప్రయోగం సక్సెస్‌.. ప్రకటించిన ఇస్రో

ISRO Successfully Launches SSLV-D2 Rocket To Deploy 3 Satellites Into Orbit From Sriharikota Today,Isro Sslv Launch Date,Sslv D1,Sslv Upsc,Sslv Stages,Mango News,Mango News Telugu,Sslv Isro Failure,Sslv Wikipedia,Small Satellite Launch Vehicle,Sslv-D1,Isro Sslv Launch,Isro Sslv D1,Isro Sslv Failure,Isro Sslv D1 Launch,Isro Sslv Upsc,Isro Sslv Wiki,Isro Sslv Test,Isro Sslv Launch Registration,Isro New Rocket Sslv

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క కొత్త రాకెట్ ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన కొద్దిసేపటికే మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి మూడు మినీ, మైక్రో మరియు నానో ఉపగ్రహాలతో ఉదయం 9:18 గంటలకు రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో భూమి చుట్టూ 450 కిమీ వృత్తాకార కక్ష్యలో వాటిని ఉంచింది. ఇక అంతకుముందు ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమయింది. ఇక ప్రయోగం విజయవంతం అయ్యాక దీనిపై ఇస్రో స్పందించింది.

‘మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2.. ఈఓఎస్-07, జానూస్-1 మరియు అజాదిశాట్‌-2లను వాటి ఉద్దేశించిన కక్ష్యల్లోకి చేర్చింది’ అని తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించింది. ఇక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మూడు ఉపగ్రహాలు.. ఈవోఎస్‌-07 బరువు 156.3 కిలోలు , ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం బరువు 8.7 కిలోలు కాగా అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన జానూస్‌-01 బరువు 11.5 కిలోలుగా ఉంది. ఇక ఈ ప్రయోగం విజయవంతంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ ప్రయోగం మొత్తం 13 నిమిషాల 2 సెకన్లలో పూర్తవడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eleven =