ఏపీఎస్ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి గుడ్ న్యూస్

AP Govt Decide to Sanction Free Bus Passes to APSRTC Outsourcing Staff From Jan 1st,APSRTC Good News To Outsourcing Employees Andra Pradesh,Mango News,Mango News Telugu,Andhra Pradesh,APSRTC Free Passes,APSRTC Good News,APSRTC Good News To Outsourcing Employees,AP Govt Decide to Sanction Free Bus Passes to APSRTC Outsourcing Staff,AP Govt,Andra Pradesh Govt,Free Bus Passes,APSRTC Outsourcing Staff,Free Bus Passes to APSRTC Outsourcing Staff From Jan 1st,Outsourcing Pass,Free Travel FacilityFor Outsourcing Employees In APSRTC,AP Government Decided To Give Free Bus Passes To APSRTC Outsourcing Staff,APSRTC Free Bus Passes,APSRTC Latest News,APSRTC News,Andra Pradesh News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 5 వేల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జనవరి 1, 2021 నుంచి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ఉచిత బస్సు పాసులు మంజూరు చేయనున్నారు. ఇప్పటివరకు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ప్రతి రోజూ విధులకు హాజరయ్యే సమయంలో తమ నివాసం నుంచి సొంత ఖర్చులతో డిపోలు లేదా పనిచేసే యూనిట్లకు చేరుకుంటున్నారు. ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యంపై వారు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు స్పందిస్తూ, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో భాగంగానే ఉచిత బస్‌పాస్‌లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సిబ్బంది వారి నివాసాల నుంచి 25 కి.మీ లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని, సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సుల్లో ఈ ఉచిత బస్‌ పాస్‌లు చెల్లుబాటవుతాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 13 =