ఏపీలో సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంపు

AP Govt Decides to Increase Stipend of Senior Resident Doctors, AP Senior Resident Doctors Stipend Increased, Increase Stipend of Senior Resident Doctors, Mango News, Senior Resident Doctors, Senior Resident Doctors Stipend, Senior Resident Doctors Stipend Increased, Senior Resident Doctors Stipend Increased In AP, Stipend of Senior Resident Doctors, Stipend of Senior Resident Doctors Increased, Stipend of Senior Resident Doctors Increased In AP

రాష్ట్రంలో సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ ను రూ.45 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. స్టైపండ్ పెంపుకు డిమాండ్ చేస్తూ సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్ పై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో డాక్టర్ల ఆందోళన సరైన నిర్ణయం కాదని, వెంటనే విరమించుకోవాలని కోరారు. ఇక రాష్ట్రంలో ఉన్న జూనియర్‌ డాక్టర్ల డిమాండ్‌పై కూడా ప్రభుత్వం చర్చిస్తోందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =