గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో పౌల్ట్రీ, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్ను మిన‌హాయింపు

house tax in telangana villages, Mango News, Poultry and Dairy Units which are in Grampanchayats Limits Exempted from House Tax, Property tax exempted for poultry dairy units, Property tax exempted for poultry dairy units in Telangana, Property Tax Exemption For Poultry And Dairy Units, property tax exemption in telangana, property tax payment, property tax payment telangana, telangana, Telangana Poultry and Dairy Units, Telangana Poultry and Dairy Units which are in Grampanchayats Limits Exempted from House Tax, telangana property tax discount

రాష్ట్రంలోని గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్‌లు, డెయిరీ యూనిట్ల‌కు ఇంటి ప‌న్నును మినహాయింపు ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసినట్టు చెప్పారు. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా పౌల్ట్రీ య‌జ‌మానులు, డెయిరీ యూనిట్‌ల ఆస్తి ప‌న్నును ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నార‌ని ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు. వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు.

దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు, డెయిరీ యూనిట్ లు వారు ఎంతో ల‌బ్ధిపొందుతార‌ని, ఆస్తిపై హ‌క్కు పొంద‌డానికి సంవ‌త్స‌రానికి వంద రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని అన్నారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని అన్నారు. ఈ నిర్ణ‌యం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ రంగంలో కొత్త వారు రావ‌డానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 9 =