5 సంవత్సరాలలోపు చిన్నారులున్న తల్లులందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Govt Decides to Vaccinate All Mothers, AP Govt Decides to Vaccinate All Mothers having Children Less Than 5 Years Age, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Govt Decides to Vaccinate All Mothers having Children, India Covid Vaccination, Mango News, Vaccinate All Mothers having Children Less Than 5 Years Age, Vaccine Distribution, Vaccine To All Mothers having Children Less Than 5 Years Age

కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారికోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు చిన్నారులున్న తల్లులందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డీఎంహెఛ్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో గ్రామాలవారీగా ఐదు సంవత్సరాలలోపు చిన్నారులున్న తల్లులందరి జాబితాను తయారుచేయాలని వైద్య అధికారులకు సూచించారు. అలాగే అర్హత కలిగిన తల్లులందరికి వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలతో ముందస్తుగా టోకెన్స్ జారీ చేయాలని చెప్పారు. ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్స్ ఈ లబ్ధిదారులందరిని గుర్తించి, కేటాయించిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకు తేదీ, సమయం ఆధారంగా వారిని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అన్ని కరోనా నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =