గుంటూరులో తొక్కిసలాట దిగ్భ్రాంతికరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Guntur Stampede Incident,Pawan Kalyan Responds over Guntur Stampede,Guntur Stampede Incident,3 People Lost lives,Stampede in Guntur, TDP Chief Chandrababu,Expressed Deep Shock over the Incident,Mango News,Mango News Telugu,Stampede Guntur,Guntur Stampede,Guntur Stampede Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

గుంటూరులోని వికాస్‌ హాస్టల్‌ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

“గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరం. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట మూలంగా ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఇప్పుడు గుంటూరులో తొక్కిసలాట చోటుచేసుకోవడం ఆందోళనకు లోను చేసింది. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు పోలీసు యంత్రాంగం తగిన భద్రతను ఏర్పాటు చేయాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =