ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నేడు (ఫిబ్రవరి 22, మంగళవారం) జరగాల్సి ఉంది. అయితే జగనన్న తోడు మూడో విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటుగా సంతాప దినాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జగనన్న తోడు కార్యక్రమం వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు రేపు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ









































