ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విశాఖ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

AP Minister Gudivada Amarnath Interesting Comments Over MLC Election Results and Vizag Capital Issue,AP Minister Gudivada Amarnath Interesting Comments,Gudivada Amarnath Comments Over MLC Election Results,Gudivada Amarnath Over Vizag Capital Issue,Mango News,Mango News Telugu,AP Minister Gudivada Amarnath Latest News,MLC Election Results 2023,Vizag Capital Issue Latest Updates,MLC Election Results Latest News,Vizag Capital Issue Live News,AP Minister Gudivada Amarnath Live News

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరియు విశాఖకు రాజధాని తరలింపు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా క్రికెట్ మ్యాచ్‌తో పోల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కోసారి అనుకోకుండా చిన్న జట్టైన కెన్యా గెలిచినట్లే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, అంతకుమించి దీనికి అంత ప్రాముఖ్యత లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సెక్టార్‌కు సంబంధించినవని, అది కూడా కేవలం రెండు శాతం వర్గానికి సంబంధించినవని చెప్పారు. ఆ 2 శాతంలో కూడా 36 శాతం ఓటింగ్ వైసీపీకి వచ్చిందని, ఫలితాలపై సమీక్షించుకుంటామని తెలిపారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండమని తాము అనలేని, అలాగే ఈ ఎన్నికలు సెమీ-ఫైనల్ అని కూడా అనలేదని స్పష్టం చేశారు. త్వరలో విశాఖ నుంచి పాలిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారన్న మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, అయితే సీఎం జగన్ విశాఖకు ఎప్పుడు వస్తారో డేట్ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు.

కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ స్థాపించారని తెలిపిన ఆయన, ఈ క్రమంలోనే స్కాం చేశారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్స్ స్కాం దేశంలోనే అతి పెదని, ఈ విషయం ప్రజలకు తెలియాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 25 కోట్లు ఖర్చు పెట్టిందని, దీనికి సంబంధించి అన్ని లెక్కలు పారదర్శకంగా ఉన్నాయని, అయితే టీడీపీ హయాంలో మాత్రం కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ అనే కంపెనీ నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారని, సింగపూర్‌కు వెళ్లిన డబ్బులు టోకెన్ల రూపంలో హైదరాబాద్‌కు వచ్చాయని తెలియజేశారు. దీని వెనుక టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు, అప్పటి మంత్రి లోకేష్ ఉన్నారని మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =