ఢిల్లీ బడ్జెట్‌పై వివాదం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal Writes Letter To PM Narendra Modi Over Stalled The State Budget,Delhi CM Arvind Kejriwal Letter To PM Modi,CM Kejriwal Letter Over Stalled The State Budget,Kejriwal Writes Letter To PM Narendra Modi,Mango News,Mango News Telugu,Arvind Kejriwal writes to PM Modi,Why are you Angry with People of Delhi,Please Dont Stall Delhis Budget,Please Don't Stop Delhi Budget,Why Are You Angry With Delhiites,Delhi CM Arvind Kejriwal Latest News,PM Narendra Modi Live Updates,Delhi State Budget News Today

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం అంటూ ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి వేడుకుంటున్నాననీ, దయచేసి త‌మ బడ్జెట్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం 2023-24 సంవత్సరాని సంబంధించి ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ సర్కార్ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వద్ద నిలిచిపోయింది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడం, మరియు బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ను క్లియర్ చేయడానికి ముందు ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చు మౌలిక సదుపాయాల కంటే ఎక్కువ ఉండటం వంటి కారణాలను చూపుతూ, వీటికి ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు, ఢిల్లీ బడ్జెట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పెండింగ్‌లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు బడ్జెట్‌ను ఆమోదించేవరకూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కుదరదని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =