ఏపీలో ఆగస్టు 1 నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ.. ప్రకటించిన మంత్రులు బొత్స, కారుమూరి

AP Ministers Botsa and Karumuri Announces Ration Rice Distribution Starts From August 1st, Ministers Botsa and Karumuri Announces Ration Rice Distribution Starts From August 1st, AP Ration Rice Distribution Starts From August 1st, AP Ration Rice Distribution, AP Minister Botsa Satyanarayana, AP Minister Karumuri Venkata Nageswara Rao, Ration Rice Distribution for 2.6 crore in AP under PMGKAY from August 1, Pradhan Mantri Garib Kalyan Anna Yojana scheme, Free rice, AP Education Minister Botsa Satyanarayana, Education Minister Botsa Satyanarayana, Minister Botsa Satyanarayana, Botsa Satyanarayana, AP Ration Rice Distribution News, AP Ration Rice Distribution Latest News, AP Ration Rice Distribution Latest Updates, AP Ration Rice Distribution Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్‌ బియ్యం పంపిణీని ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్‌ కార్డులుండగా కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని తెలిపారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క రేషన్‌ కార్డు కూడా తొలగించడం లేదని, మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు పేర్కొన్నారు.

ఇంకా వారు మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో భాగంగా రాష్ట్రంలో 4.23 కోట్ల మందికి బియ్యం అందిస్తున్నామని, మొత్తం 2.68 కోట్ల మందికి ఉచిత బియ్యం అందించనున్నామని, ఎన్‌ఎఫ్‌ఎస్‌ కార్డులున్న వారందరికీ పీఎంజీకెఏవై కింద ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి డిపోల వద్ద లబ్ధిదారులందరికీ ముందుగా బియ్యం కూపన్ల పంపిణీ చేస్తామని, ఇది ఉచితంగా ఇచ్చే బియ్యం కాబట్టి, వీరందరికీ వలంటీర్ల ద్వారా కూపన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆగష్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పౌర సరఫరాల డిపోల వద్ద ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రులు చెప్పారు.

ఇక జిల్లాల విభజన చేయకముందు వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించిన ఏడు జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 1.67 కోట్ల మందికి, మిగిలిన 6 జిల్లాలలోని ఎస్సీ, ఎస్టీలు, అట్డడుగున ఉన్న సామాజిక వర్గాలకు చెందిన 89.2 లక్షల మందికి, ఇంకా రాష్ట్రంలో అంత్యోదయ కార్డులున్న 24.60 లక్షల మందితో పాటు కొత్తగా ప్రకాశం జిల్లాలో అర్హులకు ఆగస్టు 1 నుంచి ఆ బియ్యం ఇవ్వబోతున్నామని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో బియ్యం కార్డులు తగ్గిస్తారని, రేషన్‌ షాపులు మూసేస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. ఒక్క కార్డు కూడా తొలగించడం లేదని, అలాగే ఒక్క రేషన్‌ షాపును కూడా మూసివేయడం లేదని మంత్రులు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here