రుషికొండ టూరిజం ప్రాజెక్టు ‘ఎన్జీటి స్టే’ పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, కేసు విచారణ రేపటికి వాయిదా

AP Supreme Court Objected NGT Stay On Rushikonda Tourism Project, Supreme Court Finds Fault With NGT Stay Orders, Andhra Pradesh State government has gone for an appeal against the NGT order, Supreme Court Objected NGT Stay On Rushikonda Tourism Project, SC Objected NGT Stay On Rushikonda Tourism Project, NGT Stay On Rushikonda Tourism Project, AP government moves to SSupreme Court against NGT stay, NGT stay, National Green Tribunal, National Green Tribunal stay, Supreme Court Objected National Green Tribunal Stay On Rushikonda Tourism Project, National Green Tribunal Stay On Rushikonda Tourism Project, Rushikonda Hills Tourism Project, Rushikonda Tourism Project News, Rushikonda Tourism Project Latest News, Rushikonda Tourism Project Latest Updates, Rushikonda Tourism Project Live Updates, Mango News, Mango News Telugu,

రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటి స్టే ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం ఈ స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, హిమా కోహ్లీలతో కూడిన బెంచ్ విచారించగా.. ఏపీ ప్రభుత్వం తరపున కేసును ప్రముఖ సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. విశాఖపట్నం బీచ్‌కు ఆనుకుని రుషికొండ కొండపై ప్రతిపాదిత టూరిజం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ కె.రఘు రామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ మే 11న మధ్యంతర స్టే విధించింది.

న్యూఢిల్లీలోని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ కూడా ప్రాజెక్ట్ యొక్క పర్యావరణ సాధ్యత మరియు తీర నియంత్రణ జోన్ (CRZ) అనుమతులను పునఃపరిశీలించాలా వద్దా అనే దానిపై ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఈ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ, వైజాగ్ జిల్లా కలెక్టర్ సభ్యులతో కూడిన ఈ కమిటీ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జెడ్)కు నివేదికి అందజేసింది.

అయితే రుషికొండ బీచ్‌ రిసార్ట్‌ ప్రాజెక్టు నిర్మాణాలపై స్టే విధించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత గురువారం విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను వినకుండా ఏకపక్షంగా ఎన్‌జీటీ ఎక్స్‌పార్టీ ఆర్డర్‌ను జారీ చేసిందని ఎస్‌ఎల్‌పీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసును సోమవారం విచారణకు జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈరోజు కోర్ట్ ముందు వాదనలు జరిగాయి. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =