2023 ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అందుకోనున్నది వీరే

AP Telugu and Sanskrit Academy Announces Ugadi Awards of 2023 For 7 Persons From Different Fields Here is The List,AP Telugu and Sanskrit Academy Announces Ugadi Awards,Ugadi Awards of 2023 For 7 Persons,Ugadi Awards of 2023 For 7 Persons From Different Fields,Here is The List Ugadi Awards of 2023,Mango News,Mango News Telugu,AP Telugu and Sanskrit Academy Awards 2023,Ugadi Awards of 2023 Latest News,Ugadi Awards of 2023 Live News,AP Telugu and Sanskrit Academy Latest News,AP Telugu and Sanskrit Academy Live Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన పలువురికి ఈ అవార్డులను ప్రకటించింది. రేపు నాగార్జున యూనివర్సిటీ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగు నాగార్జున మరియు మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పురస్కరాలకు ఎంపికైనవారికి వీరు అవార్డులను అందించనున్నారు. ఇక వివిధ విభాగాల కింద మొత్తం ఏడుగురు ఈ ఉగాది అవార్డులకు ఎంపికయ్యారు.

తెలుగు మరియు సంస్కృత అకాడమీ ప్రకటించిన వివరాల ప్రకారం..

  • సైన్స్ అండ్ టెక్నాలజీ – పి. గోపీకృష్ణ
  • వైద్య రంగం – డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే
  • ఫైన్ ఆర్ట్స్ – శ్రీమతి. పసుమర్తి పావని
  • జానపద మరియు నాటక రంగం – కూరటి సత్యం నాయుడు
  • వ్యవసాయ రంగం – వి. గోపీచంద్
  • సామజిక సేవా విభాగం – మాదిరెడ్డి కొండారెడ్డి
  • ప్రత్యేక వర్గం (చిత్రకళ) : ఆర్. సుభాష్ బాబు

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =