అమలాపురం: అదుపులోకి వచ్చిన పరిస్థితులు.. 144 సెక్షన్ కొనసాగింపు

AP DGP Rajendranath Reddy Announces The Situation is Under Control in Amalapuram, DGP Rajendranath Reddy Announces The Situation is Under Control in Amalapuram, Rajendranath Reddy Announces The Situation is Under Control in Amalapuram, Situation is Under Control in Amalapuram Says AP DGP Rajendranath Reddy, AP DGP Rajendranath Reddy, DGP Rajendranath Reddy, Rajendranath Reddy, AP Population Protests And Demands Retention Of Konaseema District's Original Name, AP Protests Against Govt at Amalapuram on Name Change Issue For Konaseema District, Protests Against AP Govt at Amalapuram on Name Change Issue For Konaseema District, Name Change Issue For Konaseema District, Protests Against AP Govt at Amalapuram, AP Protests Against Govt at Amalapuram, youths staged protests against changing the name of Konaseema district, name of Konaseema district, AP Protests Against Govt, Protests Against AP Govt, Konaseema district News, Konaseema district Latest News, Konaseema district Latest Updates, Konaseema district Live Updates, Mango News, Mango News Telugu,

అమలాపురంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్నటి ఉద్రిక్త పరిస్థితులు తొలిగిపోయి నేడు అదుపులోకి వచ్చాయి. ఈమేరకు ప్రస్తుతం పట్టణంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ అల్లర్లకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని, దీనిపై లోతైన విచారణ జరుపుతామని డీజీపీ ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు ‘డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసనకు దిగేందుకు ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో అమలాపురం పట్టణంలో పరిస్థితులు అదుపు తప్పాయి. అమలాపురంలో పెద్దఎత్తున గుమికూడిన ఆందోళనకారులు రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ పొన్నాడ ఇళ్లకు నిప్పుపెట్టారు. మంత్రి విశ్వరూపు కార్యాలయంపై కూడా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రాష్ట్ర మంత్రి పి విశ్వరూప్‌తో పాటు ఆయన కుటుంబాన్ని పోలీసులు సురక్షితంగా తరలించారు.

అయితే ఈ ఘటనలో ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న మూడు కార్లు త‌గ‌ల‌బ‌డిపోయాయి. ఈ సమయంలో చోటుచేసుకున్న ఆందోళనలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అమలాపురం పట్టణంలో ఒక పోలీసు వాహనం మరియు ఒక విద్యా సంస్థ బస్సును తగులబెట్టారు. ఈ సందర్భంగా కోనసీమ సాధన సమితి (కెఎస్‌ఎస్) సభ్యులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు పోలీసులు సహా ఆందోళనకారులు గాయపడ్డారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. హోంమంత్రి, డీజీపీ ఆదేశాల మేరకు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అమలాపురంలోకి బయటినుంచి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రజా రవాణాను కూడా నిలిపివేశారు పోలీసులు.

కాగా దీనిపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు, సంఘవిద్రోహులు ఈ కాల్పులకు ప్రేరేపించారని ఆమె ఆరోపించారు. జిల్లాలో ఆందోళనలు ప్రారంభించిన కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఏప్రిల్ 4న తూర్పుగోదావరి లోని కొంత భాగంతో కొత్తగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే తాజాగా దీని పేరును ‘డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు గత వారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయమని ప్రజలను కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + nineteen =