ఆ స్థానాల్లో మాదే విజయం.. మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Our success in those positions Minister KTRs interesting Comments,Our success in those positions,Minister KTRs interesting Comments,Minister KTR Comments,Mango News,Mango News Telugu,kcr, ktr, brs, telangana assembly elections, telangana politics,KTR Comments Latest News,Ktr Latest News,KTR News And Live Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
kcr, ktr, brs, telangana assembly elections, telangana politics

మంత్రి కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు.. దమ్మున్న నేత.. మాటల మాంత్రికుడు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. పార్టీ బరువు, బాధ్యతలను మోస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. మరోవైపు అసంతృప్తులను సంతృప్తి పరుస్తూ ముందుకు కదులుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీపై కన్నేసిన కేటీఆర్.. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షిస్తూ.. తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీరిక లేకుండా శ్రమిస్తున్నారు.

ఇప్పటికీ గులాబీ బాస్ తమ అభ్యర్థులను ఎన్నికల రేస్‌లోకి దించేశారు. మొత్తం 115 స్థానాలకు నెల రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించేశారు. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టినప్పటికీ.. ఆ స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులను ఖరారు చేశారు. టికెట్ దక్కిన నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ దశ ప్రచారం కూడా పూర్తి చేశారు. ఎన్నికల వరకు రెండు, మూడు దశల ప్రచారం పూర్తి చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల వేడి భగ్గుమంటున్న సమయంలో తమ పార్టీ గెలిచే స్థానాలపై కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 88 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే మరో ఆరుస్థానల్లో మజ్లిస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పుకొచ్చారు. మిగిలిన స్థానాల్లో విపక్ష పార్టీలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి కూడా తమే అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షాలు ఢిల్లీ నుంచి దిగ్గజ నేతలను దించినప్పటికీ వరిగేది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. కావాలంటే ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలు కూడా తెలంగాణలో పోటీ చేయొచ్చని అన్నారు. అటు ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని తరచూ స్టేట్ మెంట్ ఇస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒక్క గజ్వేల్‌లోనే కాకుండా.. ఈటల రాజేందర్.. మరో యాభై చోట్ల పోటీ చేసినప్పటికీ తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ఎందుకంటే ఈటల ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వచ్చే ఫలితం జీరోనేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పోయినసారి ప్రతిపక్షం కాస్త డల్‌గా ఉంది. కాంగ్రెస్, బీజేపీలు అప్పుడు కాస్త వెనుకంజలో ఉండగా.. పరిస్థితులన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. అనూహ్యంతా కాంగ్రెస్ పుంజుకుంది. సై అంటే సై అంటోంది. పలు సర్వేలు కూడా కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. ఓ రకంగా బీఆర్ఎస్‌కు ఇవి అతి కష్టమైన ఎన్నికలని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరీ ఈ సమయంలో 88 సీట్లు వస్తాయని కేటీఆర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 16 =