ఆత్మకూరు ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి, మెజార్టీ ఎంతంటే?

Atmakur Bypoll Result YSR Congress Candidate Mekapati Vikram Reddy Wins with Huge Majority, YSR Congress Candidate Mekapati Vikram Reddy Wins with Huge Majority, Mekapati Vikram Reddy Wins with Huge Majority, YSR Congress Candidate Wins with Huge Majority, Atmakur Bypoll Result, Atmakur ByElection Result, YSR Congress Candidate Mekapati Vikram Reddy, Mekapati Vikram Reddy, YSR Congress Candidate, YSRCP leader Mekapati Vikram Reddy wins big with a margin of 82888 votes, YSR Congress Candidate Mekapati Vikram Reddy Registers Massive Victory With 82888 Majority, Atmakur Bypoll, Atmakur ByElection, Atmakur ByElection Result News, Atmakur ByElection Result Latest News, Atmakur ByElection Result Latest Updates, Atmakur ByElection Result Live Updates, Mango News, Mango News Telugu,

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన 82,888 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. కాగా బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి విక్రమ్‌ రెడ్డి స్పష్టమైన ఆధిక్యం చూపించారు. రౌండ్‌ రౌండ్‌కి తన కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఆయనకు ఏ దశలోనూ ప్రత్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బ్యాలెట్‌ ఓట్లలోనూ వైసీపీకి భారీ ఆధిక్యం కనిపించింది. పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైసీపీకి 167 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి గత ఫిబ్రవరిలో హఠాన్మరణం చెందిన నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచి భారీ విజయం సాధించారు. దీంతో అధికార పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గెలుపును దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డికి ఘన నివాళిగా అందిస్తున్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =