వేరే పార్టీకి పోయే ప్రసక్తే లేదు, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్సీపీలోనే : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

AP Energy Minister Condemns Rumours Over His Joining in Janasena Party, Balineni Srinivasa Reddy Condemns Rumours Over His Joining in Janasena Party, Srinivasa Reddy Condemns Rumours Over His Joining in Janasena Party, Balineni Srinivasa Reddy Condemns Rumours, Balineni Srinivasa Reddy Joining Janasena Party Is False propaganda, Balineni Srinivasa Reddy Condemns Rumours Over His Joining in JSP, AP Energy Minister Balineni Srinivasa Reddy, Energy Minister Balineni Srinivasa Reddy, Minister Balineni Srinivasa Reddy, Balineni Srinivasa Reddy, AP Energy Minister, Balineni Srinivasa Reddy Rumours News, Balineni Srinivasa Reddy Rumours Latest News, Balineni Srinivasa Reddy Rumours Latest Updates, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఒంగోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. బుధవారం ఒంగోలులో మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే ఆలోచనే లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్సీపీలోనే ఉంటానని అన్నారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయనని, ఏపార్టీ వస్తే ఆ పార్టీలోకి మారడం జరగదన్నారు. కష్టనష్టాల్లో, లాభాల్లో అన్నింటిలో కూడా, పార్టీ ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటాను తప్ప, వేరే పార్టీకి పోయే ప్రసక్తే లేదన్నారు. తనకు సహాయం చేసింది వైఎస్ఆర్ కుటుంబమేనని, ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ముందుగా ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ చేసిన చేనేత ఛాలెంజ్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని తన పోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో తాను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా పని చేశానని, ఆనాడు వైఎస్ఆర్ చేనేతల కోసం 300కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని బాలినేని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలినేని జనసేన వైపు చూస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ అంశంపై నేడు బాలినేని స్పందిస్తూ, ఆ వార్తలను ఖండించారు. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు రెస్పాండ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =