విశాఖలో వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి

Bhumi Pooja held for YSRCP New Party Office at Visakhapatnam YV Subba Reddy Ministers Vidadala Rajini Amarnath Attends,Bhumi Pooja held for YSRCP New Party Office, YSRCP New Party Visakhapatnam, YV Subba Reddy, Ministers Vidadala Rajini, Ministers Amarnath Attends,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

విశాఖపట్నంలో ఎండాడలోని పనోరమా హిల్స్ దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎ స్సార్సీపీ) కార్యాలయానికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానున్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో నిర్మాణం చేయనున్న జిల్లా పార్టీ కార్యాలయం, భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని అన్నారు. ఈ పార్టీ కార్యాలయం యొక్క మొదటి దశ పనులను 45 నుంచి 60 రోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అలాగే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో అన్ని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల్లో 24X7 కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. త్వరలోనే న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయిన వెంటనే విశాఖలో పరిపాలనా రాజధాని పనులు మొదలు కానున్నాయన్నారు. ఇక వచ్చే జనవరి నెలలో భోగాపురం ఎయిర్ పోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =